హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద యూజీ ఆయుష్ కోర్సుల ప్రవేశాల ఫైనల్ మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ వర్సిటీ శనివారం విడుదల చేసింది. మొత్తం 2,146 మంది అభ్యర్థులతో కూడిన ఈ లిస్టులో బీసీ–-డీ కేటగిరీకి చెందిన మేకల సోమేశ్వరి 441 మార్కులు (నీట్ ఆలిండియా ర్యాంక్ 1,82,973) సాధించి మొదటి స్థానంలో నిలవగా, 177 మార్కులతో ఆయుష్.డి చివరి స్థానంలో నిలిచారు.
స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన వెరిఫికేషన్ ఆధారంగా 11 మంది అభ్యర్థులు ఎస్టీ రిజర్వేషన్కు అర్హులు కారని వర్సిటీ స్పష్టం చేసింది. ర్యాంక్ 6,41,511 కలిగిన జోడి వేదశ్రీ అనే అభ్యర్థి ఎస్టీ హోదా క్లెయిమ్కు ప్రభుత్వం నుంచి అనుమతి పెండింగ్ లో ఉన్నందున ఆమె హోదాను పెండింగ్ అండ్ కండిషనల్ గా పరిగణిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు.
